అఖండ 2 తాండవం చివరి నిమిషంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో విడుదల వాయిదాపడిన విషయం తెలిసిందే. అఖండ 2 విడుదలను లాస్ట్ మినిట్ లో ఈరోస్ సంస్థ ఆపెయ్యడం పై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తుంది. ఎప్పటి 14 రీల్స్ బాకీ నో ఇప్పుడు అఖండ 2 విడుదలకు అడ్డంపడింది. అదే ప్రభాస్ రాజా సాబ్ విషయంలో జరగొచ్చనే రూమర్స్ పై నిర్మాత స్పందించారు.
రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు ఇలా కొన్ని గంటల ముందు పోస్ట్ పోన్ అవడం నిజంగా దురదృష్టకరం, ఇలా చేస్తే ఆ ప్రభావం అందరిపై పడుతుంది. ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలి. మా రాజాసాబ్ పై కూడా రూమర్స్ వచ్చాయి. సినిమాకి సంబందించి ఎక్కడెక్కడ తీసుకున్నామో ప్రతి పెడ్డుబడిని మేము క్లియర్ చేసాము.
దానికి సంబందించిన ఫైనాన్స్ వడ్డీ కూడా త్వరలోనే కట్టెస్తాము. రాజాసాబ్ రిలీజ్ కి ఎలాంటి అడ్డంకి ఉండదు అంటూ రాజాసాబ్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ రాజాసాబ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక అఖండ 2 తో సహా సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్ని సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.




ఆంధ్ర, అమెరికా ఎక్కడయినా కార్యకర్తే అధినేత!
Loading..