నేచురల్ బ్యూటీగా సౌత్ నుంచి నార్త్ వరకు ఆడియన్స్ మనసులను దోచేస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కనిపించడం తగ్గించేసి బాలీవుడ్ లో రామాయణ లో నటిస్తుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు పారితోషికం పెంచేసింది అనే చర్చ నడుస్తుంది.
సాయి పల్లవి అమరన్ చిత్రాన్ని కమల్ ప్రొడక్షన్ లో చేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవడమే కాదు కమల్ హాసన్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు కమల్ హాసన్ మరోసారి సాయి పల్లవి కి అవకాశం ఇవ్వబోతున్నారనే వార్త నడుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కమల్ నిర్మించబోయే చిత్రంలో సాయి పల్లవి ని ఎంపిక చేస్తున్నారట.
అయితే సాయి పల్లవి ఈ చిత్రంలో నటించేందుకు గాను 15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసింది అనే వార్త కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తుంది. మరి నిడివి ఉన్న పాత్రలు, పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలని చూజ్ చేసుకుంటూ గ్లామర్ కి ఆమడ దూరాన నిలబడే సాయి పల్లవి నటనను మెచ్చి కమల్ ఆ 15 కోట్ల పారితోషికం ఇస్తారేమో చూడాలి.




BB 9: పాపం డిమోన్ పవన్ ఏమైపోతాడో.. 
Loading..