యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్`, `సలార్` తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెకక్కిస్తోన్న మూడవ పాన్ ఇండియా చిత్రం. ప్రత్యేకించి తారక్ ను ఓ అభిమా నిగా భావించి తెరకెక్కిస్తున్నాడు. దీంతో యంగ్ టైగర్ ని తన కథలో ఎంత కొత్తగా చూపిస్తాడు? ఎంత పవర్ పుల్ గా మలుస్తాడు? ప్రేక్షకులకు చూపించబోయే ఆ ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అయితే రెండు నెలలుగా ఎలాంటి షూటింగ్ చేయకుండా బ్రేక్ ఇచ్చా రు. దీంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఈ కథనాల్ని నీల్ అండ్ కో ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఎలాంటి వివరణ ఇవ్వకుండానే అదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేసారు. తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. దాదాపు రెండు నెలల తర్వాత తారక్ షూటింగ్ కి హాజరవుతున్నాడు.
మరి డే అంతా తారక్ ఏం చేస్తున్నాడంటే? నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. అవును తాజా షెడ్యూల్ షూట్ అంతా రాత్రిపూట మాత్రమే జరుగుతుంది. దాదాపు 20 రాత్రుళ్లు షూట్ ఇలాగే కొనసాగుతుందని సమాచారం. ఇలా రాత్రి పూట నిర్విరా మంగా ఇన్ని రోజుల పాటు తారక్ ఇంత వరకూ ఏ సినిమాకు పని చేయలేదు. తొలి సారి కావడంతో అతడికి ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ లా ఉంది. నైట్ షూట్ లో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారుట.
ఈ షెడ్యూల్ కోసమే తారక్ మరింత స్లిమ్ లుక్ లోకి మారాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం లుక్ పరంగా చాలా మార్పులే చేసాడు. తొలుత వెయిట్ తగ్గాడు. అయినా సరిపోక పోవడంతో నీల్ సూచనల మేరకు ఇంకా వెయిట్ లాస్ అయ్యాడు.




BB9: తనూజ ని తిట్టిన నాగార్జున
Loading..