మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 17వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. `పెద్ది` చిత్రీక రణ పూర్తయిన అనంతరం చరణ్ 17వ చిత్రంలో జాయిన్ కానున్నాడు. ఇప్పటికే సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడు. టెక్నికల్ గా యధా విధిగా పాత టీమ్ నే కొనసాగిస్తున్నాడు. అయితే ఇందులో చరణ్ కి జోడీగా హీరోయిన్ ఎవరు? అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఆ పనుల్లోనూ సుకుమార్ అండ్ కో బిజీగా ఉంది.
అయితే ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతోంది? అన్న దానిపై నెట్టింట వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇప్పటికే `రంగస్థలం` సీక్వెల్ అని కొందరు...మరి కొంతమంది ప్రీక్వెల్ అంటూ ప్రచారం చేసారు. కానీ అసలు సంగతేంటంటే? ఇది పీరియాడిక్ చిత్రమే కాదు. ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని దర్శక వర్గాల నుంచి లీకైంది. `వన్ నేనొక్కడినే` తర్వాత సుకుమార్ మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తోన్న చిత్రంగా లీకులందుతున్నాయి. అదీ ఒక భాషలో కాదు. రెండు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట.
తెలుగుతో పాటు, ఏకకాలంలో ఇంగ్లీష్ లో కూడా చిత్రీకరిం చాలన్నది ప్లాన్ గా లీకైంది. చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన పాత కథనే స్టైలిష్ ఎంటర్ టైనర్ గా మార్చాడుట. ఈ సినిమా 50 శాతం షూటింగ్ కూడా విదేశాల్లోనే ప్లాన్ చేస్తున్నారుట. అమెరికాతో పాటు, ఆస్ట్రేలియాలో మేజర్ పార్ట్ చిత్రీకరణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత చరణ్ కు హాలీవుడ్ ఛాన్సులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ చరణ్ వాటిని సున్నితంగా తిరస్కరించాడు. మాతృ భాషకే పెద్ద పీట వేసి ఇక్కడ నుంచి వరల్డ్ ని ఏలాలంటున్నాడు. నార్త్ అమెరికా, చైనా, జపాన్, మలేషియా, రష్యా లాంటి దేశాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. స్థానిక భాషల్లో రిలీజ్ చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ తదుపరి సినిమా విషయంలో కొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.




మీనాక్షి చౌదరి పెళ్లిపై ఫుల్ క్లారిటీ 
Loading..