ఇది ప్రపంచ చరిత్రలోనే అసాధారణ డీల్. వినోదరంగంతో ముడిపడిన కార్పొరెట్ వ్యవస్థలో ఇలాంటి అసాధారణమైన మెర్జర్‌ని ఇప్పటివరకూ చూడలేదు. ఈ డీల్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రఖ్యాత హాలీవుడ్ సినీనిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ని, కార్పొరెట్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీనికోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా $82.7 బిలియన్లను వెచ్చించింది. దీని విలువ భారతీయ కనెన్సీ లో 7.8 లక్షల కోట్ల రూపాయలు.
ఈ మెర్జింగ్‌తో ఇకపై వార్నర్ బ్రదర్స్ కి చెందిన స్టూడియోలు, పంపిణీ వ్యవస్థలు మొత్తం నెట్ ఫ్లిక్స్ గుత్తాధిపత్యంలోకి జారుకుంటాయి. హెబివో నెట్ వర్క్, హెచ్.బి.వో మ్యాక్స్ కార్యకలాపాలపైనా కూడా నెట్ ఫ్లిక్స్ అజమాయిషీ చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఈ డీల్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి, ఓవరాల్ గా చేపట్టాల్సిన మార్పులను చేపడుతుంది. ఇకపై డిజిటల్ రంగంలోనే కాదు థియేట్రికల్ రంగం, టీవీ రంగంలో కూడా నెట్ ఫ్లిక్స్ కి ఎదురే లేకుండా పోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథలను చెప్పేందుకు ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ తో కలిసి వస్తున్నందుకు నెట్ ఫ్లిక్స్ చాలా ఉత్సాహంగా ఉందని సంస్థ అధిపతులు ప్రకటించారు.
అయితే వందేళ్లు పైబడిన చరిత్ర ఉన్న వార్నర్ బ్రదర్స్ కథ ఇలా ముగియడం అభిమానులకు నచ్చడం లేదు. కొన్ని వందల బ్లాక్ బస్టర్ చిత్రాలను ఈ సంస్థ తెరకెక్కించింది. సినిమాల నిర్మాణంలో క్వాలిటీ, హైఫై అంటే ఏమిటో చూపించిన దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్. అయితే నెట్ ఫ్లిక్స్ డీల్ తో మునుముందు మరింత భారీతనం నిండిన సినిమాలు, టీవీ షోలు ప్రజల ముందుకు వస్తాయని భావిస్తున్నారు. ఈ శతాబ్ధ కాలంలో ప్రపంచంలోని మారుమూల ప్రదేశాలకు కూడా చొచ్చుకు వెళ్లిన దిగ్గజ సంస్థ ప్రస్తానం- ముగింపు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.




టికెట్ ధరలపై జనాలకు కోపం ఉంది
Loading..