బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది హౌస్ లో. ఎవరు టికెట్ టు ఫినాలే కొట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో వారు నేరుగా టాప్ 5 కి వెళ్ళిపోతారు. దాని కోసం అందరూ హోరా హోరీగా తలపడ్డారు. రీతూ vs భరణి ఆడిన టాస్క్ లో రీతూ గెలిచింది. దానితో భరణి ఇది అన్ ఫెయిర్ అంటూ పాత విషయాలను లాగి కళ్యాణ్ తో గొడవవపెట్టుకున్నారు.
ఇక ఈవారం నామినేషన్స్ లోకి ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కళ్యాణ్ పడాల తప్ప మిగత అందరూ ఉన్నారు. తనూజ, భరణి, డిమోన్ పవన్, రీతూ, సంజన, సుమన్ శెట్టి ఉన్నారు. మరి నామినేషన్స్ లోకి వస్తే ఎప్పుడు ఓటింగ్ లో టాప్ లేపే తనూజ ఈ వారము సత్తా చాటుతుంది. తనూజ ఏకంగా 30 శాతం ఓట్లు పట్టుకుపోయింది. ఆతర్వాత రెండో స్థానంలో అనూహ్యంగా డేంజర్ జోన్ నుంచి డిమోన్ పవన్ ఎగబాకాడు.
ఫైనలిస్ట్ రేస్ లో బాగా ఆడిన భరణి మూడో స్తానంలో ఉండగా నాలుగవ స్తానం లోకి సంజన రావడం గమనార్హం. మొదట్లో రెండో స్థానంలో ఉన్న రీతూ అనుకోకుండానే ఐదో స్థానంలోకి వచ్చి పడింది. చివరిగా సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో కొనసాగుతున్నాడు, మరి ఈవారం సుమన్ శెట్టి హౌస్ ని వీడే ఛాన్స్ అయితే లేకపోలేదు.




ఇంత జరుగుతుంటే బాలయ్య ఏం చేస్తున్నారో 
Loading..