Advertisementt

ఫైనల్లీ తెలంగాణాలో అఖండ2 సస్పెన్స్ క్లియర్

Thu 04th Dec 2025 05:44 PM
akhanda2  ఫైనల్లీ తెలంగాణాలో అఖండ2 సస్పెన్స్  క్లియర్
TS government delights Akhanda2 makers ఫైనల్లీ తెలంగాణాలో అఖండ2 సస్పెన్స్ క్లియర్
Advertisement
Ads by CJ

అఖండ 2 రిలీజ్ ముంగిట తెలంగాణ లో నడిచిన హై డ్రామా అంతా ఇంతా కాదు. ఏపీలో మూడు రోజుల క్రితమే టికెట్ రేట్ల పెంపుకు, అలాగే ప్రీమియర్ షో కి అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభత్వం జీవో జారీ చేసింది. కానీ నైజాం లోకి వచ్చేసరికి అఖండ 2 తాండవం బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం గందరగోళాన్ని సృష్టించింది. 

మరికొద్దిసేపట్లో అఖండ 2 రిలీజ్ పెట్టుకుని తెలంగాణాలో బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడం పై అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. ఈలోపే అంటే సాయంత్రం 5 గంటలకు అఖండ తాండవం రిలీజ్ ముంగిట తెలంగాణలోనూ సస్పెన్సు క్లియర్ అయ్యింది. అందులో ఈరోజు గురువారం రాత్రి ఎనిమిది గంటలకు వేసుకునే ప్రీమియర్ షోలకు ఏపీలాగే ఫ్లాట్ 600 రూపాయలు టికెట్ ధరను తెలంగాణలోనూ నిర్ణయించారు. 

ఆతర్వాత అఖండ 2 రిలీజ్ అయిన మూడు రోజుల పాటు సింగల్ స్క్రీన్స్ లో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 రూపాయలు ప్రతి టికెట్ మీద రేట్లు పెంచుకోవచ్చు. ఆపై అంటే డిసెంబర్ 8 నుంచి గరిష్టంగా అనుమతించిన రేట్లు ఉంటాయి. అయితే గతంలోలా వారం కానీ లేదా పదిరోజుల పాటు రేట్లు పెంచుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ విషయంలో ఆడియన్స్ హ్యాపీనే. 

TS government delights Akhanda2 makers:

Akhanda2 gets ticket hike nod from Telangana government

Tags:   AKHANDA2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ