భారీ అంచనాలతో.. అంతకు మించిన క్రేజ్ తో అఖండ 2 మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఓవర్సీస్ లో ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ సందడి నెలకొంది. అటు ఏపీలోనూ ఈ అర్ధరాత్రి నుంచి అఖండ 2 తాండవం ప్రీమియర్స్ మొదలుకాబోతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అఖండ 2 ప్రీమియర్స్ కి సినిమా టికెట్ రేట్స్ పెంపుకు అనుమతులు ఇచ్చేసింది.
మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న అఖండ 2కి నైజాం టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అటు ఏపీలో బుకింగ్స్ ఓపెన్ కాగా ఇటు నైజాం లో టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. తెలంగాణాలో ప్రీమియర్స్ పై, అటు బుకింగ్స్ విషయంలో నందమూరి అభిమానులు కలత చెందుతున్నారు. సినిమా విడుదలకు ముందు ఇదేం ట్విస్ట్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి పాన్ ఇండియా మార్కెట్ లో అఖండ 2 ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ప్రస్తుతం సినిమాపై విపరీతమైన క్రేజ్ కనిపిస్తున్న తరుణంలో ఇలా నైజాం అఖండ తాండవం 2 విడుదలకు లాస్ట్ మినిట్ లో ఈ టెన్షన్ ఏమిటో అభిమానులకు బొత్తిగా అర్ధం కావడం లేదు.




ఫైనల్లీ పెళ్లిపై ఓపెన్ అయిన రష్మిక
Loading..