పవర్ ఫుల్ కాంబో బోయపాటి-బాలయ్య-థమన్ అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 తాండవం మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. అఖండ 2 BGM తో థియేటర్స్ లోకి సౌండ్ బాక్స్ లు తెచ్చుకోవాలంటూ థమన్ ఈ చిత్రం పై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసాడు. బాలయ్య యాక్షన్, బోయపాటి మేకింగ్, థమన్ BGM కోసం అభిమానులు వెయిటింగ్.
అయితే అఖండ సిరీస్ కి తాండవం తోనే ఫుల్ స్టాప్ పడిపోతుంది అనుకుంటే.. అఖండ3 ని అనౌన్స్ చేసేలా ఉన్నారు మేకర్స్. బోయపాటి ప్రమోషన్స్ లోనే అఖండ 3 పై హింట్ ఇవ్వడమే కాదు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ అఖండ 3 పై క్రేజీ క్లూ ఇచ్చినట్టే కనిపిస్తుంది.
రీసెంట్ గా డైరెక్టర్ బోయపాటి తన టీమ్ తో కలిసి దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో వారి వెనుక ఉన్న డిజిటల్ స్క్రీన్‌పై JAI AKHANDA అని కనిపిస్తోంది. ఈ విధంగా బోయపాటి-థమన్ లు అఖండ 3 పై హింట్ ఇచ్చారు. అఖండ 3 కన్ఫార్మ్ అయిపోయింది...
దానికి టైటిల్ ఈ జై అఖండ ఫిక్స్ చేశారంటూ బాలయ్య ఫాన్స్ దాన్ని వైరల్ చేస్తున్నారు. అంతేనా.. జై అఖండ-మళ్లీ రౌద్రతాండవం మొదలవుతుంది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.




2026 రిలీజ్..కానీ మ్యూజిక్ ఎవరో క్లారిటీ లేదే
Loading..