సమంత.. గతంలో నాగ చైతన్య కు విడాకులిచ్చాక సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ హెల్త్ రీజన్స్ తో సతమతమై బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో స్నేహం చేసి అతనితో ప్రేమలో పడింది. కొద్దిరోజులుగా రాజ్ నిడిమోరు తో కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యడం, ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్స్ చెయ్యడం, ఎయిర్ పోర్ట్ లో కనిపించడం చూసి వారి నడుమ ప్రేమ ఉంది అని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
నిన్న సోమవారం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో యోగ సంప్రదాయం ప్రకారం రాజ్ నిడుమోరు ని సమంత వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోస్ లో రాజ్ సమంత చేతికి తోడొగిన ఉంగరం ఫొటోస్ చూసి చాలామంది సమంత ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఎప్పుడో రాజ్ నిడిమోరు ని నిశ్చితార్ధం చేసుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే సమంత చేతికి ఆ ఉంగరం కనిపిస్తుంది, సమంత ఎంగేజ్మెంట్ ని సీక్రెట్ గా దాచేసింది, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.




జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్
Loading..