సినిమాల్లో పెదవి ముద్దులిప్పుడు సహజంగా మారిపోయాయి. లిప్ లాక్ లేని సినిమాలంటూ లేవు. సీన్ డిమాండ్ చేసిందంటే? నటీనటులు ఎంత మాత్రం రాజీ పడటం లేదు. ఇంటిమేట్ సన్నివేశాలకు వెనకడుగు వేడయం లేదు. సీన్ పర్పెక్షన్ కోసం ఎన్ని టేకులైనా తీసుకుంటున్నారు. దర్శకుడు సెట్ లో ఏది చెబితే అది చేస్తున్నారు.. హీరోయిన్ల నుంచి కాదు లేదు..చేయని అనే సమాధానాలు రావడం లేదు. కానీ ఓ సీనియర్ నటి మాత్రం ముద్దు విషయంలో రీటేక్ అంటే నో చెప్పిందన్న విషయం ఎంత మందికి తెలుసు? ముద్దు సన్నివేశంలో నటించాలంటే అది ఒకసారి మాత్రమే.
రీటేక్ పేరుతో మరోసారి పెదవులు జుర్రాలంటే తన వల్ల కాదని..అవసరమైతే సినిమా వదిలేసి పోతాను తప్ప! రీటేక్ లాంటి కథలు పడొద్దని చెప్పిందిట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. సన్ని డియోల్, జుహీ చావ్లా జంటగా ధర్మేష్ దర్శన్ తెరకెక్కించిన `లూటేరే` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1993లో తెరకెక్కిన యాక్షన్ కం లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో ఓ బీచ్ సాంగ్ ఉంటుంది. అందులో జుహీ చావ్లా షర్ట్ ధరించి నటించాలి. అక్కడే హీరోతో ముద్దు సీన్ లోనూ నటించాలి.
అప్పటికే గ్లామర్ పాత్రల్లో పోషించిన అనుభవం లేదు. అయినా ధైర్యం చేసి హీరోతో ముద్దు సన్నివేశంలో నటిం చింది. కానీ ఆ సీన్ సరిగ్గా రాలేదుట. దీంతో దర్శకుడు రీటేక్ చేద్దామన్నాడుట. దీంతో జుహీ చావ్లా ఒక ముద్దు అని చెప్పి ఎన్ని ముద్దులు పెట్టిస్తారని ఎదురు తిరిగింది. మొదట నటించిన ముద్దు సీన్ తీసుకోండి. లేదంటే సినిమా నుంచి తప్పుకుంటానుందిట. దీంతో చేసేది ఏమీలేక ఆ సీన్ నే తీసుకున్నారుట.
కానీ ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు ఎలా ఉన్నారు? అన్నది తెలిసిందే. అయితే ఇక్కడ దర్శక, నిర్మాతల డిమాండ్ కూడా అలాగే ఉంది. ఆ సీన్లో నటించకపోతే నిర్దాక్షణ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పించి మరో నటిని పెట్టుకుం టున్నారు. దీంతో వచ్చిన అవకాశం కోల్పోవల్సి వస్తోంది. ఆ కారణంగా నటీమణులు రాజీ పడక తప్పడం లేదు.




అఖండ 2 పాన్ ఇండియా టార్గెట్
Loading..