బిగ్ బాస్ సీజన్ 9 లో 12 వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి మూడు వారాల తర్వాత ఎంట్రీ ఇచ్చి ఎన్నో స్ట్రాటజీలు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణితో బాండింగ్, టాస్క్ పెరఫార్మెన్స్ లో తోపు అంటూ 12 వారాలు స్ట్రాంగ్ గా కనిపించిన దివ్య ను ఆడియన్స్ మూడు వారాల ముందే ఎలిమినేట్ చేసి పంపించాలనుకున్నా బిగ్ బాస్ గత రెండు వారాలుగా ఆమెను కాపాడినా చివరికి ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
అయితే దివ్య బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటూ ఫేమస్ అయ్యి కామనర్ గా హౌస్ లోకి వచ్చి తనూజ తో భరణి బాండింగ్ బ్రేక్ చేసి తాను భరణి తో బాండ్ పెట్టుకోవడం ఆడియన్స్ అస్సలు తీసుకోలేకపోయారు. అదే ఆమెకు ఎఫెక్ట్ అయ్యింది. భరణి ని అంటిపెట్టుకుని తిరిగి, తనూజని టార్గెట్ చేసింది. అదే BB9 బజ్ లో హోస్ట్ శివాజీ దివ్య ను మొహం వచ్చేలాంటి ప్రశ్నల్తో షాకయ్యేలా చేసారు.
నువ్వు భరణి తో బాండింగ్ వల్లే ఇక్కడ ఉన్నావ్, నీ నోటి దూల, తనూజ ను టార్గెట్ చేసావ్ అంటూ శివాజీ తన ప్రశ్నలతో దివ్య ను ఉక్కిరి బిక్కిరి చేసారు. నేను భరణి గారి బాండింగ్ లో జెన్యూన్ గా ఉన్నా, కానీ వాళ్ళ ఫ్యామిలీ తనూజ ను నమ్మింది, అది నేను తీసుకోలేకపోయా, దానితో డౌన్ అయ్యా అంది. ఇక తనూజ ను నేను టార్గెట్ చెయ్యలేదు, అది నా స్ట్రాటజీ అంది, దానికి శివాజీ అది స్ట్రాటజీ అవ్వదు.. అసలు స్ట్రాటజీ తనూజ ది అంటూ దివ్యకి దిమ్మతిరిగేలా షాకిచ్చారు.
దివ్య భరణి విషయంలో తెగ ఎమోషనల్ అవుతూ తన తప్పేమి లేదు అంటూ BB9 బజ్ లో క్లారిటీ ఇచ్చేందుకు చాలానే ట్రై చేసింది.




సెన్సేషన్: రాజ్ నిడిమోరుతో సమంత వివాహం 
Loading..