Advertisementt

ప్రభాస్ స్పిరిట్ - మాసివ్ ఓటీటీ డీల్

Sun 30th Nov 2025 08:21 PM
prabhas  ప్రభాస్ స్పిరిట్ - మాసివ్ ఓటీటీ డీల్
Prabhas Spirit Biggest OTT Deal ప్రభాస్ స్పిరిట్ - మాసివ్ ఓటీటీ డీల్
Advertisement
Ads by CJ

క్రేజీ మాస్ యాక్షన్ పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ని అనౌన్స్ చేసి మూడేళ్లు పైనే అయ్యింది. ఫైనల్లీ గత వారమే స్పిరిట్ మూవీ పట్టాలెక్కింది. ఈ గురువారం నుంచి హైదరాబాద్ లోనే వేసిన భారీ సెట్ లో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలను సందీప్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. 

అయితే ఇప్పటివరకు సినిమా ఫస్ట్ లుక్ కూడా రాలేదు, అలాగే షూటింగ్ మొదలై జస్ట్ ఫ్యూ డేస్ అవుతుంది.. ఈలోపే స్పిరిట్ మూవీ కి సంబందించిన ఓటీటీ డీల్ పై ఓ న్యూస్ క్రేజీగా వైరల్ అయిపోయింది. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ స్పిరిట్ డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 160 కోట్ల డీల్ ని మేకర్స్ ముందు పెట్టడంతో స్పిరిట్ మేకర్స్ కి అది నచ్చి డీల్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. 

మరి ప్రభాస్ లుక్ టెస్ట్ జరిగింది. పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా ఉండాలో సందీప్ వంగ ఫైనల్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు స్పిరిట్ లుక్ లేదు.. అయినప్పటికీ ఈ రేంజ్ ఓటీటీ డీల్ జరగడం చూసి సందీప్ వంగ-ప్రభాస్ కాంబినేషన్ అంటే ఏమనుకుంటున్నారు, ఇది కదా స్పిరిట్ రేంజ్ అంటూ అభిమానులే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. 

Prabhas Spirit Biggest OTT Deal:

Prabhas Spirit movie seals massive OTT deal before shoot begins

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ