Advertisementt

కాంతార పై రణవీర్ కామెంట్స్-కన్నడిగులు ఫైర్

Sun 30th Nov 2025 03:58 PM
ranveer singh  కాంతార పై రణవీర్ కామెంట్స్-కన్నడిగులు ఫైర్
Ranveer Singh faced massive trolling కాంతార పై రణవీర్ కామెంట్స్-కన్నడిగులు ఫైర్
Advertisement
Ads by CJ

కన్నడ లో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు సెన్సేషనల్ హిట్ నమోదు చేసింది. కన్నడ ఇండస్ట్రీ ని కెజిఎఫ్ తర్వాత మళ్లీ అంత బ్లాక్ బస్టర్ హిట్ అందించి మరో మెట్టు ఎక్కించింది. రీసెంట్ గా అక్టోబర్ 2 న విడుదలైన కాంతారా 2 చిత్రం 800 కోట్ల మార్క్ ని సెట్ చేసింది. సౌత్, నార్త్ అంటూ బాక్సాఫీసుని షెకాడించింది. 

కాంతార 1 తోనే రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తాజాగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కాంతార చిత్రానికి ప్రశంసలు దక్కాయి. అదే ఈవెంట్ లో బాలీవుడ్ నటుడు కాంతార పై, రిషబ్ శెట్టి పై చేసిన కామెంట్స్ కన్నడిగులు ఆగ్రహానికి గురి చేసాయి. 

రణవీర్ సింగ్ ఆ వేదిక పై ముందు కాంతార గురించి ఎంతో గొప్పగా మాట్లాడి ఆ తర్వాతే కామెడీగా మాట్లాడారు. ఈ సినిమాలో రిషబ్ శరీరంలోకి పంజుర్లీ దేవత ప్రవేశించిన సమయంలో ఆయన ఓ.. అంటూ ఓ విచిత్రమైన శబ్ధం చేస్తారు. ఆ సన్నివేశాన్ని రిషబ్ శెట్టి యాక్టింగ్ ని రణవీర్ సింగ్ హేళన చేస్తూ చాలా కామెడీగా చేసి చూపించారు రణవీర్. అంతేకాకుండా రిషబ్ శెట్టి శరీరంలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సీన్స్ బావున్నాయంటూ రణవీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో పడేసాయి. 

పంజుర్లీ దేవతను పట్టుకుని దెయ్యమని అంటావా అంటూ కన్నడిగులు రణవీర్ పై ఫైర్ అవుతున్నారు.  కాంతార చిత్రాన్ని, కన్నడ సంస్కృతిని, దేవుళ్లను కించపరిచేలా కామెంట్స్ చేసిన రణవీర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కన్నడిగులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగారు.

Ranveer Singh faced massive trolling:

 Ranveer Singh ghost reference for Kantara daiva irks netizens

Tags:   RANVEER SINGH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ