బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అయేషా, రమ్య మోక్ష, మాధురి లు హౌస్ లో ఉన్న రీతూ చౌదరి-డిమోన్ పవన్, తనూజ-కళ్యాణ్ లపై విషం కక్కారు. రమ్య మోక్ష, అయేషా అయితే తనూజ ను డి గ్రేడ్ చేస్తూ మట్లాడారు. అయితే ఇప్పుడు తాజాగా సంజన 12 వ వారం నామినేషన్స్ లో రీతూ ని పర్సనల్ గా టార్గెట్ చేసింది.
తన కోసం హెయిర్ ని త్యాగం చేసిన రీతూ ని సంజన అనరాని మాటలంది. డిమోన్ పవన్ తో నువ్వు చేసేది చూడలేకపోతున్నాం, డిమాన్ పవన్ తో నువ్వు రాత్రంతా కూర్చుంటున్నావ్ అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడింది. దానితో ఇమ్మాన్యుయేల్ సంజన పై కోపం తెచ్చుకుని మాట్లాడడం మానేసాడు. శనివారం నాగార్జున ఎపిసోడ్ లో సంజన విషయంలో ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీతో ఉన్న ఆడియన్స్ కి నాగ్ కావాల్సిన ట్రీట్ ఇచ్చినట్టే ప్రోమో వదిలారు.
నాగార్జున రావడం రావడమే ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారనుకున్నాను. ఈ వారం నిన్ను బాగా డిస్టర్బ్ చేసిన గొడవేమిటి అని ఇమ్మానుయేల్ ని నాగ్ అడగ్గానే సంజన గారు రీతూ ని నామినేట్ చేసిన విధానం అన్నాడు. సుమన్ శెట్టి ని అడిగితె ఒక అమ్మాయిని అలా అనకుండా ఉండాల్సింది అన్నాడు. నాకు వారిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం అన్ కంఫర్ట్బుల్ అనిపించింది అందుకే చెప్పా తప్పేముంది అంటూ సంజన తన మాటలను సమర్ధించుకుంది.
నువ్వు పర్సనల్ అజెండా తో రీతూ ని టార్గెట్ చేసావ్, నీకు అన్ కంఫర్ట్బుల్ అనిపిస్తే డోర్స్ ఓపెన్ నువ్వెళ్ళిపోవచ్చు అన్నారు నాగ్. నీకు ఎప్పుడైనా ఆలా అనిపించిందా ఇమ్ము అన్నారు నాగ్ నో అన్నాడు. కళ్యాణ్, సుమన్, దివ్య ని అడిగారు నో అన్నారు.
సో నువ్వు హౌస్ అట్మాస్ ఫియర్ ని స్పాయిల్ చేసావు. అందుకే బిగ్ బాస్ సంజన వెళ్ళిపోతుంది ప్లీజ్ ఓపెన్ ది గేట్ అంటూ నాగార్జున సంజన పై ఫైర్ అయిన ప్రోమో వైరల్ గా మారింది.




BB9: నాగ్ కోసం అందరూ వెయిటింగ్ 
Loading..