కర్ణాటక లో కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టి కర్ణాటక లో కాంగ్రెస్ జెండా పాతడంతో దానిని తెలంగాణా ప్రజలపై అప్లై చేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవడంతో ఆంధ్ర లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చంద్రబాబు స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రభుత్వాన్ని చేపట్టిన ఏడాదికి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకమంటూ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారు. దానితో ఆడవాళ్లు చీరలు కోసం షాపింగ్ ల కోసం, గుడులు, గోపురాలు అంటూ ఫ్రీ బాస్ లో పడి తిరుగుతున్నారు.
కానీ కొంతమంది ఆడవాళ్లు మాత్రం చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం పెట్టే కన్నా ముందు ఆ డబ్బు తో రోడ్లు బాగు చేయిస్తే బావుండేది. టికెట్ ప్రైస్ తగ్గించి ఆ రోడ్ల కోసం డబ్బు పెట్టి కాస్త గుంతలు పూడవ్వల్సింది అనే మాట ఏపీ ప్రజల నుంచి వినబడుతుంది. కారణం ఏపీలోని పలు రోడ్లు ఇంకా గుంతల మయంగా ఉండడమే కాదు కనీసం ఆ రోడ్డు మీద తారు ముక్క కనిపిస్తే ఒట్టు.
అంత దారుణంగా ఏపీ పల్లెటూరు రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లలో ప్రయాణం చెయ్యలేక ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. గత ఏడాది సంక్రాంతికే రోడ్లు బాగుచేస్తామని చెప్పిన ప్రభుత్వం చాలావరకు కంప్లీట్ చేసినా.. ఇంకా కొన్ని రోడ్లకు మోక్షము కలగలేదు. అందుకే లేడీస్ చాలామంది ఉచిత బస్సు వద్దు ముందు రోడ్లు బాగుచెయ్యమని చంద్రబాబు ని వేడుకుంటున్నారు.




100 మిలియన్ల వ్యూస్ ఊరికే రావు 
Loading..