ఏ ఫ్యామిలిలో అయినా గొడవలు ఉంటాయి, ఆస్తి తగాదాలు ఉంటాయి, కానీ అవి సెలెబ్రిటీ ఫ్యామిలీస్ అయితేనే వైరల్ గా మారుతాయి. సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలిలో అన్నదమ్ముల నడుమ జరిగిన ఆస్తి తగాదాలు రచ్చకెయ్యాయి. మంచు బ్రదర్స్ ఇద్దరూ తన్నుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదంతా మీడియాలో ఎంతగా హైలెట్ అయ్యిందో జనాలు చూసారు. కానీ ఈ మంచు గొడవ ఎపిసోడ్ లో మంచు లక్ష్మి కనిపించక పోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
రీసెంట్ గా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మంచు తగాదాలపై మొదటిసారి ఓపెన్ అయ్యింది. ముందుగా దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే తాను మాత్రం తన ఫ్యామిలీ మళ్లీ పాత రోజుల్లానే కలిసిపోవాలని, ఫ్యామిలిలో ప్రతి ఒక్కరూ కల్మషం లేకుండా ఉండాలని కోరుకుంటాను అంటూ హాట్ కామెంట్స్ చేసింది.
నిజం ఏమిటంటే.. ఏ ఫ్యామిలిలో గొడవ లేకుండాఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో గొడవలు సహజమే. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు ఫ్యామిలీ కలిసి పోరాడితే.. కుటుంబం మిగులుతుంది, ఇండియన్ ఫ్యామిలీస్ లో కొన్నిసార్లు చిన్న కారణాలకే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుని దూరాలు ఏర్పడతాయి. అన్నదమ్ములైనా, తండ్రికొడుకులైనా, అక్క-చెల్లెల్లు అయినా లైఫ్ లాంగ్ కలవకూడదనే డెసిషన్స్ తీసుకుంటారు అది కరెక్ట్ కాదు.. ఎప్పటికైనా రక్త సంబంధమే మిగులుతుంది.
ఫ్యామిలీ ని కలిపి ఉంచేందుకు ఎంత దూరమైన వెళ్లాలి, ఏమైనా చెయ్యాలి. దూరాన్ని మాత్రం పెంచుకోకూడదు.. అని చెప్పిన మంచు లక్ష్మి నేను ముంబై లో ఉండి ఫ్యామిలీ వివాదాన్ని పట్టించుకోలేదని మీడియా రాసింది. ఆ సమయంలో నేను ఎంతగా బాధపడ్డానో మీకు తెలియదు అంటూ మంచు ఫ్యామిలీ వివాదంపై లక్ష్మీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.




రాహుల్ సిప్లిగంజ్- హిరణ్య వెడ్డింగ్ లుక్ 
Loading..