Advertisementt

ముత్యాల డ్రెస్ లో మురిపిస్తున్న జాన్వీ కపూర్

Thu 27th Nov 2025 01:02 PM
janhvi kapoor  ముత్యాల డ్రెస్ లో మురిపిస్తున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor looks stunning in a pearl dress ముత్యాల డ్రెస్ లో మురిపిస్తున్న జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ కి కేరాఫ్ గా నిలుస్తుంది. ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసే పిక్స్ వేటికవే ప్రత్యేకమయినవి. అందాలు ఆరబోస్తూనే గ్లామర్ డ్రెస్సులతో మత్తెక్కిస్తోంది. ట్రెడిషనల్ గా లంగావోణీ వేసినా లేదంటే చీర  కట్టినా మోడరన్ డ్రెస్ వేసినా ఏదైనా సరే జాన్వీ కపూర్ గ్లామర్ కి సాటిరారు ఎవ్వరూ.. 

తాజాగా జాన్వీ కపూర్ ముత్యాల డ్రెస్సులో మురిపించింది. డిజైనర్ లెహంగా లో టాప్ మొత్తం ముత్యాలతో అల్లినట్టు డిజైన్ చేసారు. క్రీమ్ షేడ్ లో ఉన్న జాన్వీ కపూర్ కాస్ట్యూమ్ మాత్రం అందరిని ఇంప్రెస్స్ చేస్తుంది. ఆ కాస్ట్యూమ్ లో జాన్వీ కపూర్ ముద్దబంతి పువ్వులా ముచ్చటగా కనిపించింది. 

ప్రస్తుతం హిందీలో విజయాలు దొరక్క సౌత్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది జాన్వీ. తెలుగులో పెద్ది చిత్రంలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తున్న జాన్వీ కపూర్ అల్లు అర్జున్-అట్లీ మూవీలో వన్ అఫ్ ద హీరోయిన్ గా కనిపించనుంది అనే ప్రచారం ఉంది. 

Janhvi Kapoor looks stunning in a pearl dress:

Janhvi Kapoor Steps Out Glowing In Sculpted Pearl Couture

Tags:   JANHVI KAPOOR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ