ఏపీ ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళుతున్నారు అంటే అది స్వలాభం కోసమో, లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడానికో, లేదంటే రిలాక్సేషన్ కోసం కాదు ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు అంటే అది ఏపీకి ఎంత లాభం తెచ్చిపెడుతుంది, ఆ పర్యటన వలన ఏపీ ఎంత బాగుపడుతుంది.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటన ఉంటుంది. దానికోసం మంత్రి నారా లోకేష్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు అనేది విదేశీ పర్యటనకొస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తే అర్ధమవుతుంది.
ఇప్పుడు నారా లోకేష్ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. డిసెంబర్ 6 నుంచి నారా లోకేష్ అమెరికా పర్యటన ఉండబోతుంది. నారా లోకేష్ అమెరికా ప్రయాణం మాట విన్న ఏపీ ప్రజల్లో అప్పుడే రాష్ట్రానికి ఏ భారీ పరిశ్రమను తీసుకువస్తారనే దానిపై చర్చ స్టార్ట్ అయ్యింది.
నారా లోకేష్ గత అమెరికా పర్యటనలో టెక్ దిగ్గజం గూగుల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేశ్, ఇప్పుడు అమెరికా పర్యటనలో ఏపీకి ఎంత లాభం ఉండబోతుంది అనే ఆసక్తి మొదలైంది. డిసెంబర్ 6 నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ప్రారంభం కాబోతుంది. డిసెంబర్ 6న డలస్ వెళ్లనున్న మంత్రి లోకేష్.. అక్కడ 8 వేల మందితో గార్లాండ్ లో భారీ సభ. ఆతర్వాత అంటే 8, 9 తేదీల్లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ తో పాటుగా ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు బీజేపీ, జనసేన శ్రేణులు కీలక పాత్ర పోషించనున్నారు.
గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీలను ఆకర్షించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారు. అందులో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతున్న లోకేష్ ఈ అమెరికా పర్యటన కూడా సక్సెస్ చేసుకుని రావాలని టీడీపీ కార్యకర్తలు, అభిమానులే కాదు ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు.




రామ్ కి బిగ్ రిలీఫ్ 
Loading..