ఆరడుగుల అందం చీరకడితే.. అలా చూస్తూ మైమరిచిపోవాల్సిందే. అదే అనసూయ చీరకడితే రెప్ప వెయ్యడం కూడా మర్చిపోవల్సిందే. కాస్త బరువు పెరిగినా చీరకట్టులో మాత్రం కనికట్టు చేస్తుంది. ఆరడుగుల పాలరాతి శిల్పం చీరకడితే అది చూసేందుకు అద్భుతమే. నిజమే అనసూయ అచ్చం పాలరాతి విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
తాజాగా బేబీ పింక్ పట్టు శారీలో అనసూయ మెడ నిండా నగలతో అద్భుతమైన ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. చక్కటి చీరకట్టు, హెయిర్ స్టయిల్, ఆభరణాలు అన్నిటిలో అనసూయ అలా మెరిసిపోయింది అంటే నమ్మాల్సిందే. ఈమధ్యనే ఫ్యామిలీతో కలిసి కెన్యా అడవుల్లో ఎంజాయ్ చేసి వచ్చింది.
భర్తతో కలిసి ట్రెక్కింగ్, పిల్లలతో కలిసి అరుదైన జంతువులను తిలకించడం, కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న అనసూయ పిక్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా అనసూయ ఈ పింక్ శారీ ఫొటోస్ షేర్ చేసింది.




BB9: సంజన ను ఎలిమినేట్ చేసెయ్యండి సర్ 
Loading..