Advertisementt

సాంగ్ షూట్ లో గాయపడ్డ హీరోయిన్

Sat 22nd Nov 2025 07:10 PM
shraddha kapoor  సాంగ్ షూట్ లో గాయపడ్డ హీరోయిన్
Shraddha Kapoor injured సాంగ్ షూట్ లో గాయపడ్డ హీరోయిన్
Advertisement
Ads by CJ

చాలామంది హీరోలు, హీరోయిన్స్, టెక్నీకల్ సిబ్బంది సినిమా షూటింగ్ సెట్ లో గాయపడుతుండడం సహజం. భారీ యాక్షన్ సన్నివేశాల్లోనో, లేదంటే సాంగ్ చిత్రీకరణలోనో గాయలవుతూ ఉంటాయి. అలానే ఇప్పుడొక హీరోయిన్ సినిమా సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ 

శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఈఠా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఆమె గాయాలపాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో కీలకమైన లవణీ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా శ్రద్ధ గాయపడిందని, ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలి వేళ్లకు ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తుంది. 

ఈ లవణీ సాంగ్ అత్యంత కష్టతరమైనదిగా ఉండటంతో శ్రద్ద కపూర్ సంప్రదాయ నౌవరీ చీర, భారీ ఆభరణాల్లో ప్రాక్టీస్ చేయడంతో ఆమె కు ఈ గాయమైనట్లుగా తెలుస్తుంది. దానితో శ్రద్ద కపూర్ కి డాక్టర్లు రెండువారాలు రెస్ట్ లో ఉండాలని చెప్పడంతో ప్రస్తుతం ఈఠా సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిందని సమాచారం. 

Shraddha Kapoor injured:

Shraddha Kapoor injured during rehearsals

Tags:   SHRADDHA KAPOOR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ