బిగ్ బాస్ సీజన్ నైన్ 11 వారాలు పూర్తి చేసుకోవడానికి అడుగు దూరమలో ఉంది. ఇంకా కేవలం నాలుగు వారాల గేమ్ మిగిలి ఉంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ అంటూ బలమైన ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. ఇక ఇప్పటివరకు కెప్టెన్ అవ్వని రీతూ చౌదరి 12 వ వారానికి గాను కెప్టెన్ గా నిలిచినట్లుగా తెలుస్తుంది.
అయితే గత వారం నిఖిల్, గౌరవ్ లు బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటికెళ్లిపోయారు. ఆ వారమే దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నా బిగ్ బాస్ ఎందుకో నిఖిల్ కి అన్యాయం చేసి అతణ్ణి సడన్ గా బయటికి పంపెయ్యడం పెద్ద చర్చకు దారి తీసింది. కానీ ఈవారం దివ్య నే ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్టుగా సమాచారం.
ఆమె హౌస్ లోకి మూడు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణి తో స్నేహం చెయ్యడమే కాదు భరణి తో క్లోజ్ గా ఉన్న తనూజ ను సైడ్ చెయ్యడం, ఆమెను పదే పదే టార్గెట్ చెయ్యడం దివ్య కు మైనస్ అయ్యింది. ఆమె ఆట తీరు, మాట తీరు ఆకట్టుకున్నా తనూజ విషయంలో దివ్య పై ఎఫెక్ట్ పడేసరికి ఎలిమినేట్ అయ్యేవరకు తనూజ ఫ్యాన్స్ పోరాడి ఆమెకు ఓట్స్ వెయ్యకుండా ఆమెను ఇంటికి పంపించేశారు.
అయితే అధికారికంగా బిగ్‌బాస్ ఆదివారం ప్రకటిస్తే తప్ప ఆమె ఎలిమినేషన్ పై అప్పటివరకు జస్ట్ రూమర్ అనే చెప్పాలి.




మంచు మనోజ్ న్యూ చాప్టర్ 
Loading..