ఉపాసన కామినేని కొణిదెల ఎలాంటి దాపరికం లేకుండా మనసులో దాగిన విషయాలను బహిర్గతం చేస్తుంటారు. ఆరోగ్యం, కెరీర్, పిల్లలు సహా చాలా విషయాలపై ఉపాసన అవగాహన ఎంతో ఉన్నతమైనది. తాజాగా ఆధునిక మహిళ ఎలా ఉండాలి? అనేదానిపై ఉపాసన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. నేటితరం అమ్మాయిలు కెరీర్, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత స్వావలంబనలకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎవరో చెప్పారని కాకుండా మనసుకు నచ్చిన వాడినే కట్టుకునేందుకు మగువలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
వైవాహిక అస్థిరత, గృహ హింసకు సంబంధించి ఉపాసన గతంలో చేసిన వ్యాఖ్యలకు దగ్గరగా ఈ ఆలోచన ఉంది. పెళ్లి చేసుకున్నా మహిళకు కెరీర్ ఉండాలి. ఆర్థిక భద్రత ముఖ్యం. ఇక కుటుంబం విషయంలో ఇద్దరూ ఒకటిగా ఉండాలని ఉపాసన అన్నారు. యువతులు ఆర్థిక స్వాతంత్య్రం మానసిక- శారీరక శ్రేయస్సును సాధించడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, వివాహాన్ని ఆచితూచి ప్లాన్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
మహిళకు ఆర్థిక స్థిరత్వంతో పాటు, ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. మహిళలు తమ సొంత లక్ష్యాలను, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మహిళా సాధికారతను కలిగి ఉండాలనే అభిప్రాయాన్ని ఉపాసన వ్యక్తం చేసారు. తాజాగా ఉపాసన వ్యాఖ్యలు జాతీయ వేదికలపైనా చర్చగా మారింది.




ఎన్టీఆర్-నీల్ అనుకున్న తేదికి వచ్చేనా 
Loading..