సినిమా విడుదలైన మరుక్షణమే iబొమ్మ అనే ఆన్ లైన్ వెబ్ సైట్ లో సినిమాని లీక్ చేసి అటు హీరోలను, ఇటు దర్శకనిర్మాతలు నష్టపోయేలా చెయ్యడమే కాదు ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేసిన iబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి ని తెలంగాణ పోలీసులు వల పన్ని పట్టుకోవడం సినీ హీరోలను, దర్శకనిర్మాతలకు బిగ్ రిలీఫ్ నిచ్చింది. పోలీసులు అతని చేతే ఆ వెబ్ సైట్ ని క్లోజ్ చేయించారు కూడా. iబొమ్మ వలన నష్టపోని నిర్మాతలేడు.
అందుకే తెలంగాణ పోలీసులు iబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు గాను సినిమా హీరోలు చిరు, నాగార్జున, రాజమౌళి, పవన్ కళ్యాణ్ లు అభినందిస్తూ కృతఙ్ఞతలు తెలిపారు. ఇది వారికి హ్యాపీనే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే iబొమ్మనిర్వాహకుడు రవి ని అరెస్ట్ చెయ్యడం, అలాగే i బొమ్మ వెబ్ సైట్ ని క్లోజ్ చేయించడం మూవీ లవర్స్ కి నచ్చడం లేదు. వారు రవి అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు.
కారణం ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా సినిమా చూసే అవకాశం పోవడం, అలాగే సినిమాల బడ్జెట్ లు పేరు చెప్పి టికెట్ రేట్లు పెంచి నిర్మాతలు దోచుకోవడంతో థియేటర్స్ కి వెళ్లలేక ఇలా iబొమ్మ లాంటి ఆన్ లైన్ సైట్స్ లో సినిమాలు చూసేందుకు అలవాటు పడిపోయినవారు iబొమ్మ ఇప్పుడు క్లోజ్ అవడం బొత్తిగా నచ్చలేదు.
హీరోలు భారీగా పారితోషికాలు ఛార్జ్ చేసి ఆ భారాన్ని ప్రేక్షకుల నెత్తిన టికెట్ రేట్లను పెంచి రుద్దడం, థియేటర్స్ కి వెళితే పర్సు ఖాళీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ఈ ఆన్ లైన్ చోదకుడిని అరెస్ట్ చేస్తే అంతలా రెచ్చిపోయి వారు రవి ఇమ్మడిని సపోర్ట్ చేస్తున్నారు.
మరి iబొమ్మ క్లోజ్ అయితే సినిమా ఇండస్ట్రీ కష్టాలు తీరుతాయని హీరోలు, నిర్మాతలు, దర్శకులు అనుకుంటే ప్రేక్షలు రవికి సపోర్ట్ చెయ్యడం నిజంగా షాకింగ్ విషయమే. దీనిని సినీఇండస్ట్రీ సీరియస్ గా తీసుకోవాల్సిందే!





మిల్కీ బ్యూటీతో భాయ్ సెగలు
Loading..