పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు చిత్రాలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన వయొలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దే కాల్ హిమ్ ఓజి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే ఊపులో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆల్మోస్ట్ ముగించేశారు. ఆ చిత్రం తర్వాత పవర్‌స్టార్ చేయబోయే సినిమా ఏమిటి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతంగా కనిపిస్తుంది.
పవర్‌స్టార్ నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కిక్, రేసుగుర్రం, ఊసరవెల్లి వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో సినిమాకి పవన్‌కళ్యాణ్ ఎప్పుడో కమిట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ ఒకటి బయటికొచ్చింది.
ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించే ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని.. ఈ క్యారెక్టర్‌ని దర్శకుడు సురేందర్‌రెడ్డి అద్భుతంగా డిజైన్ చేయడంతో విపరీతంగా కనెక్ట్ అయిన పవన్ ఈచిత్రానికి ఓకే చెప్పారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ కేరెక్టర్ ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత అంటే సెకండ్ హాఫ్ లో దాదాపు 50 నిమిషాల పాటు నడుస్తుందని తెలుస్తుంది. మార్చి నుంచి ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్ డేట్స్ కేటాయించారని.. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు. ఆ హీరో ఎవరు అనేది నెక్స్‌ట్ అప్‌డేట్‌లో తెలుసుకుందాం.




అమరావతిలో సల్మాన్ భారీ ఫిల్మ్‌స్టూడియో
Loading..