బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభాస్ స్పిరిట్ విషయంలో దీపికా పదుకొనె కండిషన్స్ వలన దర్శకుడు సందీప్ వంగ ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించడం, అదే క్రమంలో కల్కి విషయంలోనూ దీపికా మేకర్స్ కు కండిషన్స్ పెట్టడంతో ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీపికా పదుకొనె పై కక్ష పెంచుకున్నారు.
ఎనిమిదిగంటల పని వేళల విషయంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ పట్టుబట్టి మరీ దీపికా పదుకొనెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం షారుఖ్ అలాగే అల్లు అర్జున్ మూవీస్ లో నటిస్తుంది. కింగ్ ఖాన్ మూవీలో ఎనిమిదిగంటల వర్క్ అంటే కుదురుతుందా, అల్లు అర్జున్ సినిమా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది, దానికి ఎనిమిది గంటలే వర్క్ చేస్తాను అంటే ఎలా కుదురుతుందో మేము చూస్తాము అంటూ దీపికా పదుకొనె ను ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఆమె ఇప్పటికి తను అన్న ఎనిమిది గంటల పని వేళల పైనే స్టిక్ అయ్యి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అనడం కాదు కానీ నిజంగానే బిగ్ బడ్జెట్ సినిమాలకు దీపికా కండిషన్ ఇబ్బంది పెట్టడం గ్యారెంటీ.





BB9: నిఖిల్ ఎలిమినేషన్ పై ట్రోల్స్ 

Loading..