సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి మూవీ అప్ డేట్ కోసం ఎన్నో నెలలుగా వెయిట్ చెయ్యగా దానికి నవంబర్ 15 #GlobeTrotter ఈవెంట్ తో తెర దించారు. #GlobeTrotter ఈవెంట్ లోనే మహేష్ లుక్, టైటిల్, ఇంకా గ్లింప్స్ తో స్టోరీని రాజమౌళి ఆల్మోస్ట్ రివీల్ చేసారు. దానితో మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ.
అందులోను మహేష్ బాబు సాదా సీదాగా కాకుండా నంది మీద నుండి స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వడం, రుద్ర లుక్ లోనే అభిమానుల ముందుకు రావడం, బ్లూ చొక్కా వేసుకుని వస్తాను, నార్మల్ గా నడుచుకుంటూ వస్తాను అంటే రాజమౌళి కుదరదు అన్నారు అంటూ రాజమౌళి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినట్లుగా మహేష్ చెప్పడం అన్ని మహేష్ అభిమానులకు కొత్తగా అనిపించాయి.
అంతేకాదు #GlobeTrotter ఈవెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపించినా, 100 అడుగుల స్క్రీన్ పై వారణాసి వీడియో మొదట్లో ప్లే కాకపోవడంపై వస్తున్న మీమ్స్ విషయంలో అభిమానులు చాలా లైట్ తీసుకుంటున్నారు. మహేష్ రుద్రా గా వారణాసి లో మేము అనుకున్నట్లుగా పవర్ ఫుల్ గా కనిపించారు.
రాజమౌళి తో కలిసి మహేష్ గ్లోబ్ ని షేక్ చెయ్యడం గ్యారెంటీ.. ఈ ట్రోల్స్ మమ్మల్ని ఏమి చెయ్యలేవు అంటూ మహేష్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు.





ఐ-బొమ్మను పట్టించిన విడాకుల కేసు

Loading..