హరీష్ రావు పై అక్కసు కక్కిన కవిత

Sun 16th Nov 2025 09:21 AM
kavitha  హరీష్ రావు పై అక్కసు కక్కిన కవిత
Kavitha Slams Harish Rao After BRS Defeat హరీష్ రావు పై అక్కసు కక్కిన కవిత
Advertisement
Ads by CJ

కల్వకుంట కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం జరుగుతూనే తన బావ హరీష్ రావు ని టార్గెట్ చేస్తుంది. హరిష్ రావు కేసీఆర్, కేటీఆర్ ని మోసం చేస్తాడంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. తండ్రి కేసీఆర్ కూడా కవిత ను పక్కనపెట్టి మేనల్లుడు హరీష్ రావు ని సపోర్ట్ చెయ్యడంతో కవిత మరింతగా రగిలిపోయింది. 

అంతేకాదు కూతురు కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలో ఉంటూనే హరీష్ రావు పార్టీకి ద్రోహం చేస్తున్నాడు అంటూ కవిత నెత్తినోరు కొట్టుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి పాలవడంతో కవిత ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి హరీష్ రావు ని కడిగిపారేసింది. 

బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు కు అలవాటని, ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఎద్దేవా చేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన మద్దతు కోరిన ఇండిపెండెంట్లకు మద్దతు ఇవ్వమని అడిగినా తను ఒప్పుకోలేదు కానీ హరీష్ రావు మాత్రం మీ ఇష్టం అన్నారు అలా ఎందుకన్నారు అని కవిత కామెంట్స్ చేసింది. 

బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులు పెంచుకున్నారు కానీ, పార్టీ కేడర్‌ను పెంచుకోలేదన్న కవిత హరీష్ రావు, ఆయన భార్య సపరేట్ గా వ్యాపారాలు చేస్తున్నారు అంటూ కవిత ఆరోపించింది. 

Kavitha Slams Harish Rao After BRS Defeat:

Kavitha vs Harish Rao

Tags:   KAVITHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ