హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రపంచమంతా మెచ్చేలా #GlobeTrotter ఈవెంట్ ను సక్సెస్ చెయ్యాలనుకున్న రాజమౌళి అండ్ టీం కి టెస్టింగ్ పరీక్షగా మారింది. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్నిసార్లు మైక్స్ పనిచేయకపోవడం, తర్వాత లైటింగ్ విషయంలో తడబాటు, #GlobeTrotter ఈవెంట్ లో మహేష్ వారణాసి టైటిల్ ట్రైలర్ ని వేసే క్రమంలో అది సక్రమంగా ప్లే అవ్వకపోవడం అన్ని రాజమౌళి అండ్ టీమ్ ని టెన్షన్ కి గురి చేసాయి.
వారణాసి గా టైటిల్ రివీల్ చేస్తూ మహేష్ ని రుద్రా గా పరిచయం చేసే సమయంలో అది లైటింగ్ సరిపోక ప్లే కాకపోవడంతో యాంకర్ సుమ తన యాంకరింగ్ తో కవర్ చేసినా చాలామందిలో అసహనం తొణికిసలాడింది. ఇంత పెద్ద ఈవెంట్ లో ఇది ఫెయిల్ అయింది అంటూ రాజమౌళి ఎమోషన్ అయ్యారు. నేను దేవుణ్ణి నమ్మను ఈరోజు మా నాన్నగారొచ్చి వెనుక హనుమాన్ ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అన్నారు, నా భార్య రమ హనుమంతుణ్ణి ఫ్రెండ్ లా ట్రీట్ చేసి బాగా నమ్ముతుంది అని చెబుతూ రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోపక్క మహేష్ భర్య నమ్రత ట్రైలర్ ప్లే అవుతున్నంతసేపు ప్రే చేస్తూ ఆమె కూడా టెన్షన్ పడిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసి మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు.





వారణాసి రిలీజ్ డేట్ లీక్ చేసిన కీరవాణి

Loading..