థియేటర్స్ లో ఫెడవుట్ అయిన రాజ్ తరుణ్ కనీసం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అయినా సక్సెస్ కొడదామనుకున్నాడు. కానీ రాజ్ తరుణ్ కి ఓటీటీ కూడా షాకిచ్చింది. కెరీర్ లో వరస వైఫల్యాలు, మరోపక్క వ్యక్తిగత సమస్యలతో రెండేళ్లుగా రాజ్ తరుణ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. మాజీ ప్రేయసి తో గోల. ఆమె రాజ్ తరుణ్ ని రోడ్డున పడేసింది.
మరోపక్క సక్సెస్ లేని సినిమాలు. కథలు అలానే ఆయనతో సినిమాలు చేసే డైరెక్టర్స్ అన్ని మైనస్. అందుకే రాజ్ తరుజ్ కి సక్సెస్ రావట్లేదు. వెండితెర పై నుంచి రాజ్ తరుణ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవ అంటూ ఆహా ఓటీటీ నుంచి నేరుగా ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
ఈ శుక్రవారం ఆహా ఓటీటీలో స్ట్రామింగ్ లోకి వచ్చిన చిరంజీవ కి డిజాస్టర్ టాక్ కనిపించింది. ఆహా వాళ్ళు మాత్రం చిరంజీవ కి 100 మిలియన్ వ్యూస్ అంటున్నా.. అంత ఇంట్రెస్ గా పనిగట్టుకుని రాజ్ తరుణ్ సినిమాని ప్రేక్షకులు వీక్షించారా అనే సందేహాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
చిరంజీవ ఓటీటీ రివ్యూస్ కి పూర్ రేటింగ్స్ కనిపించడంతో రాజ్ తరుణ్ కి సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు ఓటీటీ కూడా షాకిచ్చింది అంటూ నెటిజెన్లు మాట్లాడుకుంటున్నారు.





వెయిట్ లాస్ రూమర్స్ పై తమన్నా కామెంట్స్ 

Loading..