మిల్కి బ్యూటీ తమన్నా కు సౌత్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఓదెల 2 తర్వాత తమన్నా కు తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. అయినప్పటికి గ్లామర్ షో తో సోషల్ మీడియాలో అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న తమన్నా హిందీలో ఏదో ఒక షూటింగ్ తో బిజీగానే ఉంటుంది. తమన్నా స్పెషల్ సాంగ్స్ కి మంచి గిరాకీ ఉంది.
తెలుగులోనే కాదు హిందీలోనూ తమన్నా స్పెషల్ సాంగ్స్ కి బాగా క్రేజ్ ఉంది. తాజాగా తమన్నా ను మెగాస్టార్ చిరు-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకర్ వర ప్రసాద్ గారు చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు ఆమెతో చర్చలు జరుపుతున్నారనే వార్త వైరల్ అవుతుంది.
మన శంకర్ వర ప్రసాద్ గా చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని, ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా మెగాస్టార్‌తో కాలు కదిపితే క్రేజ్ వస్తుంది అని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఈ సాంగ్ కోసం భారీ సెట్ వేసి అందులో ఈ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.
మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, కమర్షియల్ హంగుల కోసం అనిల్ రావిపూడి ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని, అందులో తమన్నా అయితే భారీ క్రేజ్ వస్తుందని అనిల్ ప్లాన్ గా చెబుతున్నారు. గతంలో తమన్నా చిరు తో భోళా శంకర్ చిత్రంలో నటించింది.





BB 9: ఇమ్మాన్యుయెల్ కి గట్టిపోటీనే 

Loading..