నటి శ్రద్ధా దాస్ పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ దాదాపు రెండు దశాబ్ధాలుగా నటిగా కెరీర్ ని సాగిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటించింది. అయితే పెద్ద స్టార్ కావాలన్న కలను సాకారం చేసుకోలేకపోయింది. శ్రద్ధా ఇటీవల వెబ్ సిరీస్ లు సహా సినిమాల్లోను నటిస్తోంది. ఈ ఏడాది `సెర్చ్: ది నైనా మర్డర్ కేస్` అనే సిరీస్‌లో శ్రద్ధా నటించింది. రోహన్ శిప్పి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. `అర్థం` అనే చిత్రంలోను ఈ బ్యూటీ నటిస్తోంది.
శ్రద్ధా దాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గాల్లో ఎగురుతున్న విమానంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంది. విస్తారకు చెందిన ఓ విమానంలో ప్రయాణిస్తుండగా, సాంకేతిక సమస్య ఎదురైంది. ముంబై నుంచి ఆ విమానం హైదరాబాద్ కి చేరుకోవాల్సి ఉంది. కానీ టేకాఫ్ అయిన తర్వాత ముంబై విమానాశ్రయంలోనే తిరిగి ల్యాండ్ అయింది. దాదాపు ఆ విమానం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది.. మరణం ఇంకెంతో దూరంలో లేదనిపించింది. ఆ సమయంలో భయాందోళనలతో గడిపానని శ్రద్ధా గుర్తు చేసుకుంది. అదే విమానంలో తన పక్కనే ఉన్న రష్మిక మందన్న మాత్రం కూల్ గా సెల్ఫీ దిగిందని చెప్పింది. చివరికి ప్రమాదం నుంచి ఆ విమానం బయటపడింది. కొంత టెన్షన్ కి గురైనా కానీ భామలు బతికి బయటపడ్డారు.
శ్రద్ధా దాస్ చాలా కాలంగా నటిగా కెరీర్ సాగిస్తున్నా ఎందుకనో లక్ కలిసి రాలేదు. కానీ రష్మిక నటించిన మొదటి సినిమా నుంచి అదృష్ట నాయికగా వెలిగిపోతోంది. అప్పుడప్పుడు ఫ్లాపులొచ్చినా వాటి ప్రభావం రష్మిక పై పడలేదు. ఇటీవల వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగేసింది.





మ్యాజిక్ చేస్తున్న చిరు-చరణ్ 

Loading..