కెరీర్ లో ఒకటి రెండు హిట్స్ తప్పితే అన్ని సినిమాలు ప్లాప్ లే. నిన్నగాక మొన్న మాస్ జాతర తో హిట్ కొడుతుంది అనుకుంటే అది ఆమెకు నిరాశ పరిచే ఫలితమే ఇచ్చింది. ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్లు తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల కు యువ హీరోలు అంతా షాకిచ్చారు. సినిమా కథల కన్నా ఆమె ఎంచుకునే పాత్రలే ఆమెను ట్రోల్ అయ్యేలా చేసాయి.
మాస్ జాతర పై శ్రీలీల నమ్మకం పెట్టుకుంటే ఆఖరికి రవితేజ కూడా శ్రీలీలను మోసం చేసాడు. రీసెంట్ గా విడుదలైన మాస్ జాతర ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. శ్రీలీల కు ఎన్ని ప్లాప్ లు వస్తే ఏమిటి ఆమెకు ఇంకా క్రేజ్ ఉంది. అది ఆమెను రెండు చేతులా సంపాదించేలా చేస్తుంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా శ్రీలీల క్రేజ్ కనబడుతుంది.
అదే ఆమెను రిబ్బన్ కటింగ్స్ వైపు లెక్కెళ్లేలా చేస్తుంది. పలు వస్త్ర దుకాణాలను ఓపెనింగ్ చేస్తూ హీరోయిన్స్ తెగ సంపాదించేస్తారు. ఆ లిస్ట్ లో శ్రీలీల చేరడమే కాదు.. హిట్ లేకపోయినా రిబ్బన్ కటింగ్స్ కి కొదవలేదు అన్నట్టుగా శ్రీలీల తాజాగా వరంగల్ లో ఓ వస్త్ర దుకాణాన్ని ఓపెన్ చెయ్యడానికి వచ్చింది. అక్కడ శ్రీలీల ను చూసేందుకు చాలామంది ఎగబడిన వీడియో వైరల్ అవుతోంది. రోడ్లన్నీ బ్లాక్ అయ్యి శ్రీలీల వస్తుంది అని అభిమానులు ఎగబడడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు.




పండంటి బాబు కి జన్మనిచ్చిన కత్రినా కైఫ్ 

Loading..