Advertisementt

అక్కడే కాదు ఇక్కడా వదలని మాధురి

Thu 06th Nov 2025 10:41 AM
divvala madhuri  అక్కడే కాదు ఇక్కడా వదలని మాధురి
Divvala Madhuri targeting Reethu chowdary అక్కడే కాదు ఇక్కడా వదలని మాధురి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లోకి సంచలనాలకు కేరాఫ్ అయిన దువ్వాడ మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి తిరిగే దివ్వెల మాధురి పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి ఉంది. దానిని పోగొట్టుకోవడానికి బిగ్ బాస్ కి వచ్చాను అన్న మాధురి హౌస్ లో ముందు తనూజ ని తప్పుగా అనుకుని తర్వాత రియలైజ్ అయ్యి తనూజ తో ఫ్రెండ్ షిప్ చేసింది.

కానీ రీతూ విషయంలో మాధురి హౌస్ లోనే కాదు, ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాక కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. బిగ్ బాస్ లో రీతూ-పవన్ బాండింగ్ అన్ హెల్దీ బాండింగ్ అంటూ రీతూ ని టార్గెట్ చేసిన మాధురి డిమాన్ పవన్ ని మాత్రం ప్రేమతో చూసుకుంటుంది. రీతూ ని అదే విషయంలో నామినేట్ కూడా చేసింది.

అంతేకాదు ఆమె బయటికొచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ పై మాధురి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. రీతూ చిన్న పిల్ల అన్న యాంకర్ పై ఫైర్ అవుతూ రీతూ చిన్న పిల్లేమి కాదు ఆల్రెడీ పెళ్ళయ్యి డివోర్స్ తీసుకుంది. నేను హౌస్ లోకి వెళ్ళేటప్పుడు రీతూ ఇంటినుంచి కాల్ చేసి రీతూ కి మీరు హౌస్ లోపలికెళ్ళాక చెప్పండి, బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి పవన్ తో తిరగొద్దని చెప్పమని చెప్పారు.

రీతూ హౌస్ లో చేసే పనులు చూసి ఆమె తల్లి దొర్లి దొర్లి ఏడుస్తుంది అని వాళ్ళ వాళ్ళే చెప్పారు. కాబట్టే నేను మాట్లాడాను అంటూ దువ్వాడ మాధురి అటు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు ఇటు బయట ఇంటర్వ్యూలోను రీతూ ని వదలడం లేదు 

Divvala Madhuri targeting Reethu chowdary:

  Divvala Madhuri publicly criticizing Reethu Chowdary  

Tags:   DIVVALA MADHURI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ