అఖండ తాండవానికి కేవలం 30 రోజులే ఉంది. ఈరోజు నవంబర్ 5. డిసెంబర్ 5 న అఖండ తాండవం చిత్రం విడుదలకాబోతుంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నాలుగోసారి నటిస్తున్న క్రేజీ చిత్రం అఖండ 2. ఇప్పటికే పవర్ ఫుల్ టీజర్స్ అభిమానులను ఇంప్రెస్స్ చెయ్యగా.. విడుదలకు నెల మాత్రమే ఉంది.. ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యరేమిటి అనుకున్న క్షణంలోనే మేకర్స్ అఖండ 2 నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
అఖండ తాండవనికి వేళయ్యింది అంటూ ఫస్ట్ సింగిల్ అప్ డేట్ అందించారు. కార్తీక పౌర్ణమి రోజు అఖండ 2 నుంచి ఈ నెల 7 న ఫస్ట్ సింగిల్ ప్రోమో వదులుతున్నట్టుగా పవర్ ఫుల్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు. అసలే పాన్ ఇండియా మర్కెట్ లోకి అఖండ 2 ని దించుతున్నారు. ఈనెల మొత్తం సినిమా ని పాన్ ఇండియా మర్కెట్ లో ప్రమోట్ చెయ్యాలి.
అది ఇప్పటినుంచే ఫస్ట్ సింగిల్ ప్రోమో తో అఖండ 2 మేకర్స్ భారీ గా స్టార్ట్ చేసారు. మరి అఖండ 2 పాన్ ఇండియా ఈవెంట్స్ ఇంకే రేంజ్ లో ప్లాన్ చేస్తారో చూడాలి.




దెబ్బకు దిగొచ్చిన బండ్ల గణేష్

Loading..