కొన్ని సినిమాలు థియేటర్స్ లో ప్లాప్ అయితే దానిని ఓటీటీలో ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. అంటే ఆ సినిమాలు ఓటీటీలో పెద్ద హిట్ గా నిలుస్తాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయినా.. ఓటీటీలో మాత్రం సో సో గా వెళ్లిపోతాయి. ఇప్పుడు అదే లిస్ట్ లోకి మలయాళ బ్లాక్ బస్టర్ కొత్త లోక చాప్టర్ 1 చేరింది.
మలయాళంలో తెరకెక్కి పాన్ ఇండియా భాషల్లో కూడా హిట్ అయ్యి మలయాళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా 300 కోట్ల క్లబ్బులోకి చేరి రికార్డ్ క్రియేట్ చేసిన కళ్యాణి ప్రియదర్శి కొత్త లోక చిత్రం సినిమా థియేటర్స్ లో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఫ్యాన్సీ డీల్ తో జియో ప్లస్ హాట్ స్టార్ కొత్త లోక హక్కులు దక్కించుకుంది.
అయితే జియో ప్లస్ హాట్ స్టార్ లో కొత్త లోక చాప్టర్ 1 రికార్డ్ లు క్రియేట్ చేస్తూ భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది అనుకుంటే.. కొత్త లోక ఓటీటీలో అంతగా సందడి చేసినట్లుగా కనిపించడం లేదు. మరి థియేటర్స్ లో హిట్ అయిన ఈ బొమ్మ ఓటీటీ కి వచ్చేసరికి ఉసూరుమనిపించింది అనే చెప్పాలి.




మిత్రమండలి ఓటీటీ డేట్ వచ్చేసింది
Loading..