మ్యాన్ ఆఫ్ మాసెస్ కంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే ఆయన అభిమానులకు కిక్ ఇస్తుంది. వార్2 తో డిజప్పాయింట్ చేసిన ఎన్టీఆర్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి డ్రాగన్ నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేసినా వార్ 2 వల్ల పోస్ట్ పోన్ అయ్యింది.
అది జరిగి ఐదు నెలలు అవుతున్నా నీల్ మాత్రం ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ ఇవ్వకుండా అభిమానులను వెయిట్ చేయిస్తున్నారు. అందులో ఈమధ్యన ఎన్టీఆర్-నీల్ మూవీపై అనేకరకాల రూమర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టాయి. అలాగే ఎన్టీఆర్ బాగా వెయిట్ లాస్ అయ్యి మరీ లీన్ గా మారిపోవడము ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టింది.
తాజాగా ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లుక్ వైరల్ అవుతుంది. అందులో ఎన్టీఆర్ లీన్ లుక్ లో చాలా స్టైలిష్ గా అదరగొట్టేసాడు. కూలింగ్ గ్లాసెస్, గళ్ళ చొక్కా, మీసం తిప్పుతూ కనిపించేసరికి ఏముందిరా ఎన్టీఆర్ రాజసం అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ మాత్రం బాగా ఇంప్రెస్స్ చేస్తుంది.




పెద్ది: చరణ్ ప్రేయసి చికిరి కోసం 

Loading..