హీరో రవితేజ పై విమర్శల దాడి ఎక్కువైంది. కారణం ఆయన తన సినిమాల విషయంలో సీరియస్ గా ఉండడం లేదు, సినిమాల ప్రమోషన్స్ కి రారు, నిర్మాతల విషయంలో రవితేజ లైట్ గా ఉంటారు. సినిమా విడుదలకు ముందు మీడియా కి ఇంటర్వూస్ ఇవ్వరు, ఓ కామన్ ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే రవితేజ కనిపిస్తారు.
సినిమా విడుదలయ్యాక రిజల్ట్ తో పని లేకుండా మరో సినిమాకి జంప్ అవుతారు. హిట్ అయినా, లేదంటే ప్లాప్ అయినా ఎలాంటి సంబంధం లేకుండా ఉండిపోతారు. ఒక్క సినిమా హిట్ అయ్యాక పొలోమని నిర్మాతలు రవితేజ వద్దకు వస్తారు, కాని వరస వైఫల్యాలు నిర్మాతలను ముంచేస్తున్నాయి.
అయినా రవితేజ లో మార్పు లేదు, రవితేజ సినిమాల స్పీడు కన్నా ముందు కథల ఎంపికపై దృష్టి పెట్టాలనే సలహాలు మరోపక్క మాస్ జాతర రిజల్ట్ విషయంలో రవితేజ పట్టించుకోకుండా తదుపరి సినిమా సెట్ పైకి వెళ్లిపోయారు. పారితోషికం విషయంలోనూ రవితేజ తగ్గరు అంటూ రవితేజ పై మాస్ జాతర రిలీజ్ తర్వాత విమర్శలు ఎక్కువయ్యాయి.
మరి రవితేజ ఈ విమర్శలను పట్టించుకుంటారో, లేదంటే గాలికొదిలేస్తారో చూడాలి.




పరాశక్తిపై భారం వేసిన బ్యూటీ

Loading..