రవితేజ హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాడు. కొన్నాళ్లుగా ఆయన వరస సినిమాలు డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లాయి. ప్రెజెంట్ ఆయన నటించిన మాస్ జాతర పరిస్థితి అదే. అసలు రవితేజ కెరీర్ పై ఫోకస్ పెడుతున్నాడా, లేదంటే పారితోషికం కోసం వచ్చిందల్లా చేస్తున్నాడా అనే విషయంలో ఆయన అభిమానులకే అనుమానాలున్నాయి.
ఏ హీరో కూడా డిజాస్టర్ ని కావాలని కొని తెచ్చుకోరు. అదే రవితేజ విషయంలోనూ జరిగింది. కానీ కథలు, అలాగే దర్శకులపై రవితేజ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్ జాతర విషయమే తీసుకోండి.. మొదటి రోజుకే మిక్స్డ్ టాక్, తర్వాత రోజే డివైడ్ టాక్ రావడంతో దాని రిజల్ట్ ఏమిటో తేలిపోయింది. అసలు మాస్ జాతర లాంటి సినిమాని ఎందుకు ఆడియన్స్ రిజెక్ట్ చేశారు, తప్పెక్కడ జరిగింది అనే విషయం వదిలేసి రవితేజ వెంటనే పనిలో పడిపోయాడు. అది మంచి డెసిషనే.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో #RT76 చేస్తున్న రవితేజ అప్పుడే సాంగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్న రవితేజ వర్క్ పై ద్యాస పెట్టి కెరీర్ పై ఫోకస్ వదిలేశారనే మాట వినబడుతుంది. పని పై శ్రద్ద ఉండడం లో తప్పు లేదు కానీ.. కెరీర్ ఖతం అయ్యే సినిమాలు చేస్తేనే డేంజర్. ఆ విషయంలో రవితేజ ఆలోచిస్తే బెటర్.. అంటూ రవితేజ కు చాలామంది సలహాలివ్వడం విశేషం.




కాంగ్రెస్ కి అదే మైనస్ 

Loading..