Advertisementt

BB9: బాండింగ్స్ బ్రేక్ చేసిన హౌస్ మేట్స్

Sun 02nd Nov 2025 04:04 PM
bigg boss 9  BB9: బాండింగ్స్ బ్రేక్ చేసిన హౌస్ మేట్స్
BB9: Housemates Who Broke Bonds BB9: బాండింగ్స్ బ్రేక్ చేసిన హౌస్ మేట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 లో భరణి తో బాండింగ్ పెట్టుకున్న తనూజ ఇమ్మాన్యువల్ తో ఫ్రెండ్ షిప్ చేసింది. కానీ ఇమ్మాన్యువల్ ఫ్రెండ్ షిప్ టాస్క్ ల విషయంలో క్రమేణా తగ్గుతూ వచ్చింది. తనూజ ఆట తీరు ఇమ్మాన్యువల్ కి నచ్చలేదు, ఇమ్మాన్యువల్ బిహేవియర్ తనూజ కి నచ్చలేదు. ఇక వైల్డ్ కార్డు గా దివ్య ఎంటర్ అయ్యాక భరణి కి జీడీ పాకంలా అతుక్కుంది.

భరణి ని బందాలతో బందించి అతని ఆటని ఇష్టపడిన ప్రేక్షకులే బంధాల కారణంగా హౌస్ నుంచి పంపించేల చేసారు. ఆతర్వాత ఎలాగో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లోకి అడుగుపెట్టాక తనూజ కాస్త దూరంగా ఉన్నా దివ్య భరణి ని వదల్లేదు. కానీ గత రాత్రి బిర్యానీ టాస్క్ లో భరణి-మాధురి గొడవలో దివ్య ఎంటర్ అవడం, భరణి దివ్య కోసం మనస్ఫూర్తిగా స్టాండ్ తీసుకోకపోవడం అన్ని నాగార్జున చూపించారు. 

దానితో దివ్య భరణి తో దూరంగా ఉంటుంది. సండే టాస్క్ లో ఎవరు పాయిజన్ అనుకుని ఈ ఇంజెక్షన్ తాగించాలంటే సుమన్ శెట్టి నాకు గౌరవ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అంటూ గౌరవ్ కి పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వగా.. దివ్య నేను భరణి గారి ఫ్రెండ్ షిప్ వల్ల టాస్క్ లో ఎక్కడైనా ఎమోషనల్ గా ఆగిపోతానేమో అంది. ఆతర్వాత తనూజ ఇమ్మాన్యువల్ నిన్ను నేను మనస్ఫూర్తిగా టాస్క్ ల్లో ఎంకరేజ్ చేసి గెలవాలని అనుకున్నా కానీ నువ్వు అలా లేవు అంది. 

నువ్వు నన్ను అడగలేదు, వేరే వాళ్ళు అడిగారని సపోర్ట్ చేశాను అంటూ ఆ పాయిజన్ ఇంజక్షన్ తాగేశాడు. అలా భరణి-దివ్య బాండింగ్ బ్రేక్ అవ్వగా.. ఇమ్ము-తనూజ మరింతగా దూరమైపోయారు. 

BB9: Housemates Who Broke Bonds:

Bigg Boss 9 : Sunday Promo review

Tags:   BIGG BOSS 9
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ