సీరియల్ నటి తనూజ అంటే బిగ్ బాస్ కి ఇష్టం, నాగార్జున కూడా తనూజ ను ఏమి అనరు. ఆమెకి సీక్రెట్ గా వీడియోస్ వేసి చూపిస్తారు తప్ప తనూజ పై ఎలాంటి యాక్షన్ ఉండదు, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ. అందుకే ఆమె టాస్క్ సరిగ్గా ఆడకపోయినా ఆమెకి ఇస్తారు, ఇంకెందుకు బిగ్ బాస్ సీజన్ కప్ నేరుగా ఆమె చేతుల్లో పెట్టెయ్యండి అంటూ తనూజ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
అయితే ఈవారం రేషన్ మేనేజర్ గా తనూజ కరెక్ట్ గానే ఉన్నా ఆమె మాట తీరు హౌస్ మేట్స్ ని ఇబ్బంది పెట్టింది. సంజన దగ్గర నుంచి మాధురి, ఇంకా కళ్యాణ్ ఇలా అందరితో రేషన్ మేనేజర్ గా తనూజ గొడవపడింది. హార్ష్ గా మాట్లాడడం, శ్రీజ విషయంలో యాటిట్యూడ్ చూపించడం ఇవన్నీ తనూజ కి మైనస్ అయ్యాయి.
అదే విషయం నాగార్జున శనివారం కాకుండా ఆదివారం ఎపిసోడ్ లో తనూజ పై ఫైర్ అయ్యారు. రేషన్ మేనేజర్ గా ఈ వారం అందరితో గొడవ పడ్డావు అంటే అది హౌస్ మేట్స్ వల్ల, అలాగే నా వల్ల కూడా తప్పు జరిగింది అంది. ఇక తనకు రేషన్ మేనేజర్ వద్దు, కిచెన్ డిపార్ట్మెంట్ వద్దు అన్నా ఇమ్మాన్యువల్ ఇచ్చాడు అనగానే ఏంటి ఇమ్ము ఎందుకు ఇచ్చావ్ అన్నారు నాగార్జున.
మాధురి లేచి ఆమె వద్దు అనలేదు సైలెంట్ గా ఉంది అంది.. నువ్వు రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాలి, కాని అలా లేదు అంటూ నాగార్జున తనూజ కి గట్టిగానే క్లాస్ పీకిన ప్రోమో వదిలారు.




వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్ 

Loading..