అసలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా పెద్ది మేకర్స్ ఈరోజు శనివారం జాన్వీ కపూర్ లుక్ ని ఆమె కేరెక్టర్ కి సంబందించిన స్టిల్స్ ని రివీల్ చెయ్యడం నిజంగా మెగా అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-జాన్వీ కపూర్ ఫస్ట్ టైమ్ జోడి కడుతున్న పెద్ది చిత్రంలో ఇప్పటివరకు రామ్ చరణ్, విలన్ రోల్ శివ రాజ్ కుమార్ పాత్రలను పరిచయం చేసారు.
ఈరోజు జాన్వీ కపూర్ లుక్ వదిలారు. జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి గా అచ్చియమ్మా(Achiyyamma) అనే పాత్రలో కనిపించబోతున్నట్టుగా ఆమె రెండు లుక్స్ తో పరిచయం చేసారు. అందులో ఒకదానిలో బండి పై క్యూట్ గా కనిపించిన జాన్వీ కపూర్, మరో పిక్ లో మైక్ ముందు బ్యూటిఫుల్ గా అచ్చియమ్మా పాత్రలో నిజంగా అద్దరగొట్టేసింది.
పెద్ది లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతుంటే.. జాన్వీ క్రికెట్ కామెంటేటర్‌గా కనిపించనుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించబోతుంటే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.




అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో ఆమె చాలా స్పెషల్ 

Loading..