బిగ్ బాస్ సీజన్ 9 సగం పూర్తయ్యి పీక్ స్టేజ్ కి వచ్చేసింది. చదరంగం, రణరంగం అంటూ కింగ్ నాగార్జున హడావిడి చేస్తున్నారు. నిజంగానే బిగ్ బాస్ హౌస్ కూడా వైల్డ్ కార్డులు, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ అంటూ నానా గందరగోళం గా అయ్యింది. భరణి, శ్రీజాల రీ ఎంట్రీ లో శ్రీజ వెళ్లిపోగా భరణి పర్మినెంట్ హౌస్ మేట్ అయ్యారు.
ఈ వారం కెప్టెన్ గా తనూజ ను ఓడించిన హౌస్ మేట్స్ దివ్యను కెప్టెన్ గా చేసారు. రీతూ ని రేషన్ మేనేజర్ గా చేసారు. అయితే గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో తనూజ, కళ్యాణ్, సంజన, రీతూ, రాము, దువ్వాడ మాధురి, పవన్, గౌరవ్ లు ఉన్నారు.
వారిలో తనూజ, కళ్యాణ్ లు ఆడియన్స్ ఓట్లు కొల్లగొట్టడంలో పోటీపడుతున్నారు. మూడో ప్లేస్ కోసం సంజన, రీతూ పోటీపడ్డారు. ఈ వారం డేంజర్ జోన్ కి వచ్చేసరికి.. పవన్, రాము, మాధురి, గౌరవ్ లు ఉన్నారు. మరి లీస్ట్ ఓటింగ్ లో ఉన్న గౌరవ్, మాధురి లలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సిందే.




మెగాస్టార్ ఫ్యామిలీ గౌరవం నిలబెట్టే హీరో

Loading..