మాస్ మహారాజ్ రవితేజ-బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కలయికలో డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర చిత్రం రేపు విడుదల కాబోతుండగా.. నిర్మాత నాగవంశీ తన సినిమాపై నమ్మకంతో ఒకేరోజు ముందే అంటే ఈరోజే అక్టోబర్ 31 న సాయంత్రం ప్రీమియర్ కి వెళ్లిపోయారు.. ఇప్పటికే మాస్ జాతర ప్రీమియర్స్ పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా మాస్ జాతర ప్రీమియర్స్ పై స్పందిస్తున్నారు.
రవితేజ మరోసారి పోలీస్ డ్రెస్ లో లుక్స్ వైజ్ గానే కాదు, ఎనేర్జి లెవల్స్ డ్రాప్ అవ్వకుండా టైటిల్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు రవితేజ పెరఫార్మెన్స్ తో ఇరగదీసేసాడు. రవితేజ పోలీస్ క్యారెక్టర్ పీక్స్, రవితేజ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్, ఆయన యాక్షన్, డాన్స్ మరియు కామెడీ అదిరాయి అంటూ రవితేజ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేసారు.
మాస్ జాతర కి ఇంటర్వెల్ బ్యాంగ్ వేరే లెవల్, ఫస్టాఫ్ సాలీడ్ ఎంగేజింగ్‌గా ఉంది. బీమ్స్ సిసిరోలియోది నెక్ట్స్ లెవల్ డ్యూటీ, విలన్ కేరెక్టర్ నవీన్ చంద్ర బెస్ట్ ఇచ్చాడు, డైరెక్టర్ భాను భోగవరపు డైలాగ్స్ అయితే ఫైర్, సెకండాఫ్‌లో పూర్తిగా యాక్షన్ బ్లాక్స్, ఎనర్జిటిక్ సాంగ్స్, హై ఓల్టేజ్ క్లైమాక్స్ అంటూ మాస్ జాతర పై మరికొందరు ఆడియన్స్ స్పందిస్తున్నారు.
రవితేజ-శ్రీలీల కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ అట్రాక్షన్, ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయ్, సాంగ్స్ లో రవితేజ - శ్రీలీల ఎనేర్జిటిక్ డాన్స్ లతో అద్దరగొట్టేసారు.. ఓవరాల్ గా సినిమా గుడ్ అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. మరి మాస్ జాతర అసలు కథ ఏమిటి అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..




అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ 
Loading..