Advertisementt

బిగ్ బాస్ 9-శ్రీజ అవుట్-భరణి ఇన్

Thu 30th Oct 2025 10:17 PM
bharani  బిగ్ బాస్ 9-శ్రీజ అవుట్-భరణి ఇన్
Bigg Boss 9-Sreeja out-Bharani in బిగ్ బాస్ 9-శ్రీజ అవుట్-భరణి ఇన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికెళ్లిపోయిన శ్రీజ, భరణి లను మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. భరణి ఎలిమినేషన్ అన్యాయం అన్నారు. అందుకే బిగ్ బాస్ వారిద్దరికీ మరో అవకాశం ఇవ్వడమే కాదు ఎవరు హౌస్ లో కొనసాగాలి అనేది టాస్క్ లు నిర్ణయిస్తాయని చెప్పారు. 

మొదటి టాస్క్ లో సంచాలక్ గొడవలతో ఆ టాస్క్ పోయింది. రెండో టాస్క్ లో శ్రీజ, భరణి బదులు దివ్య ఆడితే అందులో భరణి కోసం నిలబడిన దివ్య గెలిచింది. ఆతర్వాత టాస్క్ లో కళ్యాణ్ vs రాము పోటీపడ్డారు. అలా టాస్క్ ల్లో భరణి గెలిచాడు. అటు బయట బిగ్ బాస్ వోటింగ్ లోను భరణి కి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. 

దానితో భరణి ని పర్మినెంట్ హౌస్ మేట్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేసాడు. సో శ్రీజ హౌస్ లో ఉంటుంది అని చాలామంది భావించినా.. శ్రీజ వెళ్ళిపోయింది. ఇక శ్రీజ హౌస్ లో వుండకపోవడమే మంచిది అంటూ చాలామంది అనడమే కాదు.. శ్రీజ గొంతు వింటేనే చిరాకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

ఇకపై భరణి బంధాలు వదిలేసి తన ఆటతో టాప్ 5 లోకి ఎలా అడుగుపెడతాడో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి. 

Bigg Boss 9-Sreeja out-Bharani in:

Bharani and Srija re-entered Bigg Boss Telugu 9 for a second chance

Tags:   BHARANI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ