Advertisementt

యష్ టాక్సిక్ వెనుక ఏం జరుగుతుంది

Wed 29th Oct 2025 02:58 PM
yash toxic  యష్ టాక్సిక్ వెనుక ఏం జరుగుతుంది
What is happening with Yash Toxic యష్ టాక్సిక్ వెనుక ఏం జరుగుతుంది
Advertisement
Ads by CJ

క్రేజీ అప్ డేట్స్ తో వార్తల్లో నిలవాల్సిన యష్ టాక్సిక్ మూవీ ఈ మధ్యన వేరే రీజన్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్, కియారా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కీ రోల్ లో కనిపిస్తుంది. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని 2026 మార్చ్ విడుదల అన్నారు. కానీ ఇప్పుడు టాక్సిక్ పై కనబడుతున్న న్యూస్ లు చూస్తే 2026లో ఈసినిమా రిలీజ్ కష్టమంటున్నారు. అసలు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పటివరకు తెరకెక్కించిన టాక్సిక్  ఫుటేజ్ ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వకపోవడంతో యష్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక కొంత కాలం షూటింగ్ ఆపేసి స్క్రిప్ట్ మీద మళ్ళీ వర్క్ చేద్దామని గీతూ మోహన్ దాస్ తో చెప్పినట్లుగా టాక్ వినబడుతుంది.

టాక్సిక్ మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కినా గీతూ మోహన్ దాస్ ఇప్పటివరకు ఇంత భారీ బడ్జెట్ మూవీస్ ని హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోవడం, యష్ కెజిఎఫ్ ప్రభంజాన్ని కంటిన్యూ చెయ్యడానికి తపన పడుతూ ఉండడమే టాక్సిక్ రీ షూట్ కి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరి యష్ అతి జాగ్రత్తలే ఇప్పుడు టాక్సిక్ అనుకున్న సమయానికి రాదు అనే మాటకు బలం చేకూరుస్తుంది అనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. 

What is happening with Yash Toxic:

Yash Toxic Faces Postponement

Tags:   YASH TOXIC
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ