Advertisementt

గ్లామర్ షో పై శ్రీలీల ఓపెన్ కామెంట్స్

Wed 29th Oct 2025 11:10 AM
sreeleela  గ్లామర్ షో పై శ్రీలీల ఓపెన్ కామెంట్స్
Sreeleela open comments on glamour show గ్లామర్ షో పై శ్రీలీల ఓపెన్ కామెంట్స్
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ గ్లామర్ షో చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతాము, పది కాలాలు ఇండస్ట్రీ లో నిలబడాలి అంటే అలాంటి గ్లామర్ పాత్రలు చెయ్యాలి అంటూ వాటికే  ఓటేస్తారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ మాత్రమే గ్లామర్ షో చెయ్యకపోయినా టాప్ పొజిషన్ కి వెళ్లొచ్చు, నటన తో ఆకట్టుకుంటే చాలు అనుకునేవారు చాలాకొద్దిమందే ఇండస్ట్రీ లో కనిపిస్తారు.

ఇక శ్రీలీల గ్లామర్ షో చేసినా ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు అని చాలామంది అంటూ ఉంటారు. ఆమె నటించిన సినిమాలన్నిటిలోను శ్రీలీల గ్లామర్ నే హైలెట్ చేసారు దర్శకనిర్మాతలు. తాజాగా గ్లామర్ షో చెయ్యకపోతే ఎవరూ దేకరు అంటూ శ్రీలీల మాస్ జాతర ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా వైరల్ అవుతున్నాయి. 

నా డ్యాన్స్ మీద చాలా మంది కామెంట్ చేస్తున్నారు అంతేకాదు స్టార్టింగ్ కన్నా ఇప్పుడు కొంచెం గ్లామర్ ఎక్కువైందని చెబుతున్నారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎక్కువగా ఫిజిక్ పై ఫోకస్ చెయ్యలేదు. కానీ ఇండస్ట్రీలో గ్లామర్ చూపించకపోతే ఛాన్స్ లు రావు. ట్రెండ్ కు తగ్గట్టు మనం మారాల్సిందే. సినిమాల్లో లాంగ్ జర్నీ చేయాలంటే మాసివ్ గ్లామర్ లుక్ ఉండాల్సిందే అంటూ శ్రీలీల గ్లామర్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది. 

Sreeleela open comments on glamour show:

Sreeleela comments on glamour show

Tags:   SREELEELA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ