Advertisementt

మాస్ జాతర హిట్ - ఆ ముగ్గురికి కీలకమే

Tue 28th Oct 2025 07:27 PM
mass jathara  మాస్ జాతర హిట్ - ఆ ముగ్గురికి కీలకమే
Mass Jathara Hit - The Key for Those Three మాస్ జాతర హిట్ - ఆ ముగ్గురికి కీలకమే
Advertisement
Ads by CJ

మాస్ జాతరతో ఈ నెల 31 న ప్రీమియర్స్ తో సందడి చెయ్యడానికి రవితేజ-శ్రీలీల సిద్ధమవుతున్నారు. ధమాకా తో హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజ కి మళ్లీ ఇప్పటివరకు హిట్ లేదు. అటు శ్రీలీల పరిస్థితి అలానే ఉంది. ధమాకా హిట్ తర్వాత ఆ స్థాయి హిట్ ఆమె ఖాతాలో పడలేదు. ఇక ఈ ఇద్దరే కాదు మాస్ జాతర హిట్ అనేది మరో నటుడికి కీలకం కానుంది. 

అతనే నవీన్ చంద్ర. హీరో గా అవకాశాలు తగ్గగానే విలన్ గా టర్న్ అయిన నవీన్ చంద్రకు ఇప్పటివరకు ఫుల్ లెంత్ విలనిజాన్ని చూపించే అవకాశం రాలేదు. ఇప్పుడు మాస్ జాతరలో నవీన్ చంద్ర ఫుల్ లెంత్ మాస్ విలనిజాన్ని చూపించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన మాస్ జాతర ట్రైలర్ లో నవీన్ చంద్ర విలన్ లుక్ మాత్రమే కాదు ఆయన పాత్ర విలనిజం బాగా హైలెట్ అయ్యింది. 

కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న మాస్ జాతర సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియదు కానీ.. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల తో కెమిస్ట్రీ, డాన్స్ మూమెంట్స్ తప్ప మిగతాదంతా రొటీన్ గా అనిపిస్తుంది అంటూ మాస్ జాతర ట్రైలర్ పై నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

మరి మాస్ జాతర ట్రైలర్ సినిమాపై టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ తో ఉంది. అదే ఊపులో మాస్ జాతర ను ఫుల్ గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ తో కష్టపడుతున్నారు. చూద్దాం రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ఈముగ్గురికి మాస జాతర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అనేది. 

Mass Jathara Hit - The Key for Those Three:

Mass Jathara 

Tags:   MASS JATHARA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ