Advertisementt

చీర జట్టులో సెక్సీగా సమంత

Tue 28th Oct 2025 03:24 PM
samantha  చీర జట్టులో సెక్సీగా సమంత
Samantha looks sexy in a saree outfit చీర జట్టులో సెక్సీగా సమంత
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో అడుగుపెట్టాక సమంత రూపమే మారిపోయింది. సౌత్ లోను గ్లామర్ షో చేసే సమంత బాలీవుడ్ లోకి వెళ్లేసరికి దానిని డబుల్ చేసింది. గ్లామర్ షో తో సెక్సీగా మారిపోయింది. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత అందాల ఆరబోత మరింతగా ముదిరింది. ఆతర్వాత అనారోగ్య కారణాలతో నటనకు బిగ్ బ్రేక్ తీసుకుంది. 

చాలా రోజుల తరవాత తానే నిర్మాతగా నందిని రెడ్డి దర్శకత్వం మా ఇంటి బంగారం చిత్రానికి క్లాప్ కొట్టింది. తాజాగా సమంత ఓ ఈవెంట్ కి హాజరైంది. ఆ ఈవెంట్ లో సమంత చీరకట్టులోనే సెక్సీగా కనిపించింది. బ్లూ శారీ లో సమంత సన్నగానే ఉన్నా బోల్డ్ గా సమంత గ్లామర్ షో చూసి అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. మిస్ యు సామ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ప్రస్తుతం సమంత, రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే వార్తలు హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న సమయంలోనే సమంత తన కొత్త చిత్రం మా ఇంటి బంగారంలోను రాజ్ నిడమోరు తో కలిసి వర్క్ చెయ్యడం పై మరిన్ని అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈవిషయమై సమంత ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. 

Samantha looks sexy in a saree outfit:

Samantha Ruth Prabhu latest photos goes viral

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ