ప్రస్తుతం హైవేల కోసం, రింగ్ రోడ్స్ కోసం లక్షల కోట్లు, వేలకోట్లు వెచ్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని పల్లెటూర్ల రోడ్ల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళలో ఏ ఒక్క రోడ్ ని వారు పట్టించుకోకుండా వదిలేసారు. జనాలు ఛస్తే మాకెందుకు అని పట్టించుకోలేదు. దానితో ఏపీలోని ప్రతి రోడ్డు అద్వాన్న స్థితికి చేరుకోవడమే కాదు ప్రజల నడుం విరగ్గొట్టాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక చాలావరకు రోడ్లు బాగు చేసినా ఇంకా పల్లెటూర్లలో రోడ్లన్నీ దీనావస్థలోనే ఉన్నాయి. అసలు రోడ్ పై తారుముక్క కనిపిస్తే పాపం అన్నట్టుగా గుంతలతో రోడ్లన్నీ దారుణాతిదారుణంగా తయారయ్యాయి. రోడ్ల పరిస్థితి అలా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.
ఇప్పుడు వైసీపీ నేతలు జనసేన నేత పవన్ కళ్యాణ్ రోడ్లు బాగు చేయిస్తామన్నారు. ఏదో రోడ్ పై పాలు పోస్తే ఎత్తుకోవచ్చన్నారు, కానీ పాలకు బదులు బురద వస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఏ ప్రభుత్వమైనా రోడ్లు బాగు చేసే కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ఎన్నికల్లో ఆ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.




బిగ్ బాస్ 9-దమ్ము తో దుమ్ము రేపిన శ్రీజ 

Loading..